DCP Ram Reddy | మంథని, ఫిబ్రవరి 10: మున్సిపల్ ఎన్నికల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంథనిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎలాంటి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
స్థానికేతరులు ఎవరు కూడ ఉండవద్దని, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దూరంలోనే రాజకీయ పార్టీల నాయకులు ఉండాలన్నారు. పోలింగ్ సమయంలో ఘర్షణలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చదువుకునే విద్యార్థులు ఎన్నికల సమయంలో గోడవలకు దిగి అనవసరమైన కేసుల్లో ఇరికి తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఎన్నికలకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట సీఐ రాజుతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.