ముత్తారం, మార్చి2: అడవిశ్రీరాంపూర్లోని కోయచెరువు ప్రాంతంలో పులి కదలికలు కనిపించినట్టు అటవీ శాఖ అధికారులు తెలిపారు. పొలాల వద్ద పులి పాదముద్రలు కనిపించినట్టు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అక్కడకు చేరుకొని పరిశీలించారు. వాటిని పులి పాదముద్రలుగా నిర్ధారించినట్టు ఎఫ్ఎస్వో నర్సయ్య తెలిపారు. అడవిశ్రీరాంపూర్తో పాటు ఇతర పరిసర గ్రామా ప్రజలు అటవీప్రాంతంలో పులి సంచరించిన పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పులి కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.