Vemulawada | వేములవాడ, మార్చి 13 : వంటగ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో వేములవాడ పట్టణంలోని టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ మార్గంలో భాగంగా కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని టిఫిన్లు తయారు చేస్తున్నారు. జాతర గ్రౌండ్ లోని శ్రీలక్ష్మి ఇడ్లీ సెంటర్ నిర్వాహకుడు సాయినాథ్ మాట్లాడుతూ గత రెండు మూడు రోజులకే గ్యాస్ నిలువలు లేక దుకాణాన్ని మూసి వేసామని తెలిపారు.
భక్తుల మీదే ఆధారపడే వ్యాపారం కనుక కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకొని శుక్రవారం నుండి తిరిగి టిఫిన్ సెంటర్ ను ప్రారంభించామని తెలిపారు. వినియోగదారులకు కావలసిన ఇడ్లీ, పూరీలు, మైసూర్ బజ్జి, దోష లాంటివి కట్టెల పొయ్యి మీదనే తయారుచేసి అందించామని తెలిపారు. కొంత ఆలస్యమైన వినియోదారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా రాజన్న సన్నిధికి వచ్చే భక్తులే అధికంగా ఉండే అవకాశం ఉన్నందున వారికి కావలసిన విధంగా టిఫిన్లు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.