Huzurabad | హుజురాబాద్ రూరల్, నవంబర్ 22 : హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామంలోని శ్రీ శివ పంచాయతన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ. శిఖర యంత్ర ప్రతిష్ట, శాంతి కల్యాణం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శనివారం హనుమాన్ నామంతో గ్రామం మార్మోగింది. ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్య సమక్షంలో వేద పండితులు చెరుకుపల్లి నిఖిలాచార్య, సుజిత్ కుమార్ చార్యులు, సముద్రాల గోపాలకృష్ణ మాచార్యులు, హర్షవర్ధనాచార్యులు వేద మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు.
రెండో రోజు శనివారం గోపూజ, యాగశాల ప్రవేశం, ద్వార తోరణ ధ్వజ కుంభ పూజ, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర, మూర్తి మంత్ర హోమం, మన్యు హస్త హోమం, ధ్వజస్తంభ, శిఖరానికి పంచగవ్య తోపాటు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కుమారస్వామి, మాజీ సర్పంచులు ప్రతాపరెడ్డి, శ్రీనివాసరెడ్డి, భాస్కర్, ఎంపీటీసీలు రాజేశ్వర్ రెడ్డి, రామ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్, గ్రామస్తులు తిరుపతి రెడ్డి, చిరంజీవి రెడ్డి, వాసుదేవా రెడ్డి, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు.