సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్/ చందుర్తి, సెప్టెంబర్ 5 : కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు తంగళ్లపల్లి, చందుర్తి మండల కేంద్రాలతోపాటు మూడపల్లి, మర్రిగడ్డ, మల్యాల, జోగాపూర్, లింగంపేట, నర్సింగాపూర్, తిమ్మాపూ ర్, తదితర గ్రామాల్లోని ముఖ్య కూడళ్లలో ‘కాళేశ్వరమే లేకుంటే’ అనే శీర్షికతో ఏర్పాటు చే సిన ఫ్లెక్సీ చూపరులను ఆలోచింపజేస్తున్నది. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాకు అందుతున్న ఫలా లు, సాగునీటి వివరాలను కళ్లకు కట్టినట్టు అం దులో వివరించారు.
తెలంగాణలో సాగు, తా గునీటి గోస తీర్చిన ప్రాజెక్టు ముమ్మాటికీ కాళేశ్వరం. దీని నిర్మాణంతోపాటు రాజన్న సిరిసి ల్ల జిల్లాలో శ్రీరాజరాజేశ్వర ప్రాజెక్టు(మిడ్ మానేరు), కోనరావుపేటలో మల్కపేట రిజర్వాయర్, అనంతారంలో అన్న పూర్ణ రిజర్వాయర్లు నిర్మించారు. రాష్ట్ర తొలి ముఖ్యమం త్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులతో జిల్లాకు అనేక ఫలాలు అందాయి. 27 టీఎంసీలతో మిడ్ మానేరు ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాంతాలకు నీళ్లందిస్తున్నది. మెట్టప్రాంతమైన రాజన్న సిరిసిల్ల జిల్లాను సస్యశ్యామలం చేసింది. సాగునీటి గోసను తీర్చింది.
తెలంగాణకు గుండెకాయలా మిడ్ మానేరు ప్రాజెక్టు నిలిచింది. ఇల్లంతకుంట మండలం అనంతారంలోని అన్నపూర్ణ రిజర్వాయర్లను నింపి, కల్పతరువుగా మారింది. ఇదంతా కాళేశ్వర ప్రాజెక్టుతోనే జరిగిందని తెలిసిందే. ప్రస్తుత రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారం, కేసీఆర్పై అక్కసుతో అవినీతి అంటూ, సీబీఐ కేసులు అంటూ వేధిస్తున్న వి షయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఆధ్వర్యం లో కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాకు లింక్ 3, 4లో 9, 10 ప్యాకేజీల్లో రూ.4,468 కోట్లు వె చ్చించి 1,11,150 ఎకరాలకు సాగునీరందిస్తున్నదని ప్లెక్సీలో ప్రదర్శించారు. అసలు కాళేశ్వరం లేకుంటే జలాశాయాల నిర్మాణం జరిగేవా..? అంటూ పేర్కొన్నారు.