Dava Vasantha | రాయికల్, జులై 17: ప్రస్తుత దుర్భార పరిస్థితి చుస్తే కాలం కాటేసిన కరువులా లేదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం తెచ్చిన కరువేనని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు. అల్లీపూర్ గ్రామంలో ఎస్సారెస్పీ కెనాల్ కు నీళ్లు విడుదల చేయాలనీ కోరుతూ అల్లీపూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్ద రైతులతో కలిసి పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలో గురువారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముక్కోటి దేవుళ్లపై ప్రమాణాలు చేసి, అబద్దపు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికీ జ్ఞనోదయం కలిగి, హామీలు అమలు చేసేలా బుద్దిని ప్రసాధించాలని ఆ పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన 20 నెలల పాలనలో రైతుల పరిస్థితి అత్యత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఅరెస్, కేసీఆర్ గారి హయాంలో కెనాల్ లు, చెరువులు, కుంటలు జల కళతో నిండి ఉండేవని, చెరువులు మత్తళ్లు దుంకిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని లేకుంటే రైతులతో కలిసి నీటీ విడుదలకు బీఆర్ఎస్ పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు బర్కం మల్లేష్, ఎలిగేటి అనిల్ , కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఉదయశ్రీ, మాజీ ఎంపీటీసీ దొంతి నాగరాజు, మండల, పట్టణ ప్రధాన కార్యదర్శులు కొండపల్కుల రత్నాకర్ రావు, మహేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు మారంపెల్లి సాయికుమార్, కన్నక మహేందర్ నాయకులు అనుమల్ల మహేష్, జానా గంగాధర్, రాచమడుగు సాగర్ రావు, శ్రీ రాముల సత్యనారాయణ, కమాలకర్ రావు, పడాల సత్యం, ప్రశాంత్ రావు, అభికృష్ణ, సుతారి తిరుపతి, హరి కృష్ణ, జలపతి రెడ్డి, గంగారెడ్డి, లక్ష్మణ్, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, చంద్రయ్య, అశోక్, కుమార్, మోహిద్, నరేష్ గౌడ్, ఆశాలు, లింగారెడ్డి, నర్సయ్య, గంగమల్లు, నరేష్, ఎర్రయ్య, బక్కన్న, చిన్న పోచాలు, సోమయ్య, రాజు, రాము రైతులు పాల్గొన్నారు.