 
                                                            కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : మూడోరోజు శనివారం కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ ఎంపీ స్థానాలకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్లో మూడు, పెద్దపల్లిలో 6, నిజామాబాద్‌లో 7 వచ్చినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. కరీంనగర్లో ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ కాగా, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన పినిశెట్టి రాజు, జమ్మికుంట గ్రామానికి చెందిన రాపోలు రాంకుమార్ భరద్వాజ్ తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి పమేలా సత్పతికి అందజేశారు.
పెద్దపల్లిలో స్వతంత్ర అభ్యర్థులుగా గవ్వల శ్రీకాంత్, లింగాల లచ్చయ్య , మేకల అక్షయ్ కుమార్, జాడి ప్రేమ్ సాగర్, కాంగ్రెస్ తరఫున కటూరి సందీప్, పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా (డెమోక్రటిక్) పార్టీ తరఫున మోతె నరేశ్ ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. నిజామాబాద్‌లో 7 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు.
 
                            