Thimmapur | రేణిగుంట జిల్లా పరిషత్ పాఠశాలలో వనమహోత్సవం.. మల్లాపూర్లో వృక్ష బంధన్
తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మొక్కలు నాటి మన మహోత్సవాన్ని ప్రారంభించారు.

Thimmapur | తిమ్మాపూర్, ఆగస్టు 25 : తిమ్మాపూర్ మండలంలోని రేణిగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మొక్కలు నాటి మన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆరోగ్యమైన వాతావరణాన్ని అందించే బాధ్యతను ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ల్యాగల దేవేందర్ రెడ్డి, వార్డు సభ్యులు కొర్రి వంశీ, కనపర్తి చంద్రశేఖర్, బోయిని శంకరయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు బిరం మహేశ్వరి, మాజీ ఉపసర్పంచ్ బావండ్ల రాజయ్య, బొంగాని రమేష్, మహిళా మండల సమైక్య సంఘం, సీసీ చంద్రమౌళి, సీఏ శ్రీధర్, శ్రీలత, స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉపాధ్యాయులు, మాహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
రక్షాబంధన్.. వృక్షబంధన్..
తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్ ఆధ్వర్యంలో హిందీ పాఠ్యాంశంలోని పర్యావరణ పరిరక్షణ అంశాన్ని విద్యార్థులకు ప్రాక్టికల్ గా వివరించేందుకు మొక్కలు నాటించి వాటికి రక్షాబంధన్ కట్టించి వాటి సంరక్షణ బాధ్యత మీదేఅని విద్యార్థులతో రాఖీ కట్టించారు. దీంతో మొక్కకు విద్యార్థులకు ఒక అనుబంధం ఏర్పడి మొక్కను పెంచే విధంగా విద్యార్థులను తయారు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మామిడి మమతా సతీష్, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు వరగంధి సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ పాశం మంజుల, కారోబార్ అంజయ్య, ఉపాధ్యాయులు సయ్యద్ షఫీక్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

