Road damage | వెల్గటూర్, జూన్ 15 : రోడ్డును తవ్వి అప్పనంగా వదిలేశారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండపల్లి మండల కేంద్రం నుండి వెలగటూర్ మండలంలోని జగదేవ్పేట వరకు ఉన్న తారు రోడ్డును నూతనంగా నిర్మాణం చేయడానికి గత రెండు నెలల క్రితం తవ్వి వదిలేశారు. దీంతో కంకర తేలి వాహనాలు తరచూ స్కిడ్ అయి పడిపోతూ ప్రయాణికులు గాయాలపాలు అవుతున్నారు.
అయినా ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులు అంటి ముట్టనట్టు చోద్యం చూస్తూ ఉన్నారు. జగదేవ్ పేట కొండాపూర్ ఎండపల్లి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా రోడ్డులో ఆగు చేసి ఇబ్బందులు తొలగించాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.