Thimmapoor | తిమ్మాపూర్, జూలై 9: తిమ్మాపూర్ మండల కేంద్రంలో హోటల్స్ బిజినెస్ ఎక్కువగా ఉంది. హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్ఛలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. తమకే గిరాకీ రావాలని స్వార్థంతో రకరకాల పనులు చేస్తున్నారు.
హోటల్స్ ముందు ఉన్న చెట్టూ, పుట్టా మావే అనుకుంటున్నారేమో.. ఎవరు వచ్చి అడుగుతారో చూద్దాం అనుకుంటున్నారో గానీ, హరితహారం కింద నాటగా పెరిగిన రోడ్డుపై ఉన్న చెట్ల కమ్మలను తీసేసి ఎండిపోయేలా చేసి.. కలర్లు వేసి, అట్రాక్షన్ కనిపించేలా రంగురంగు లైట్లను పెడుతున్నారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఒకరిని చూసి ఒకరు తమకే గిరాకీ రావాలని రోడ్డు పక్కన చెట్లను ఇలా చేస్తున్నారు. రోడ్డుపై ప్రత్యక్షంగా కనిపిస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు.