voters’ list | కాల్వ శ్రీరాంపూర్, ఆగస్టు 29 : స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ విషయమై గ్రామస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలని మాజీ ఎంపీపీ నూనేటి సంపత్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఓటర్ల జాబితాను ఆయన శుక్రవారం పరిశీలించారు.
అనంతరం మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఇచ్చే ఓటర్ జాబితా ముసాయిదాను గ్రామస్థాయిలో పరిశీలించి అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకుపోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.