karimnagar | కమాన్ చౌరస్తా, మే 12 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రూట్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం వైశాఖ పౌర్ణమి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్తలు చక్రం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఆలయ ఈవో కందుల సుధాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం సాయంత్రం సహస్రదీపాలంకరణ గరుడ వాహన సేవ ఘనంగా చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలు నిర్వాహకులు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.