Godavarikhani | తెలంగాణ రాష్ట్ర సైకిలింగ్ పోటీల్లో జిల్లా మహిళా క్రీడాకారుల సత్తా
హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆస్మిత ఖేలో ఇండియా ఉమెన్ సైకిలింగ్ (సౌత్ ఇండియా జోన్) క్రీడా పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహిళా క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు.
Godavarikhani | కోల్ సిటీ, నవంబర్ 16 : హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద జరిగిన ఆస్మిత ఖేలో ఇండియా ఉమెన్ సైకిలింగ్ (సౌత్ ఇండియా జోన్) క్రీడా పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మహిళా క్రీడాకారులు పాల్గొని సత్తా చాటారు. ఈమేరకు ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మల్లారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. సైకిలింగ్ క్రీడకు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉందనీ, ఈ క్రీడలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు.
అంతేగాక పోటీల్లో పతకాలు సాధించిన మహిళలకు రైల్వే, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీస్ శాఖతోపాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో స్పోర్ట్స్ కోటా కింద నేరుగా ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థినులకు స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. అనంతరం విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇదే స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సైకిలింగ్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కాంతారావు, కోచ్ చంద్రారెడ్డి, మ్యాక్స్ వెల్ పెద్దపల్లి జిల్లా సైకిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆసంపల్లి శ్రీనివాస్, సెక్రెటరీ తగరపు శంకర్, కరీంనగర్ జిల్లా అసోసియేషన్ సెక్రెటరీ సురభి వేణుగోపాల్, పీడీ శారద తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madurai Tanishq Heist:
Alprazolam | బిజినేపల్లిలో అక్రమ అల్ప్రాజోలం తయారీ కేంద్రం గుట్టురట్టు
NIMS Staff | మాకు పెన్షన్ ఇవ్వడమే రూ.100 కోట్ల స్కామా..? : కవిత ఆరోపణలపై నిమ్స్ ఉద్యోగులు
కొమిరిశెట్టి దివ్యకు ఎంజీయూ డాక్టరేట్
Aadhav Arjuna: టీవీకే మంత్రి ఆధవ్ అర్జునతో విడిపోయినట్లు ప్రకటించిన డైసీ మార్టిన్
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

