ధర్మపురి,సెప్టెంబర్ 20: మండలంలోని నేరళ్లలో ఈగల్స్ యూత్ సభ్యులు హరితహారాన్ని ప్రతిబింబించేలా వినాయకుడి మండపాన్ని తీర్చిదిద్దారు. చెట్లు, మర్రి ఊడలు, కొమ్మలతో పచ్చదనం ఉట్టిపడేలా అలంకరించారు. ఇందులో వినాయకుడిని ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేస్తున్నారు. వినూత్నంగా ఆలోచించి గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేసిన యువకులను గ్రామస్తులు అభినందిస్తున్నారు.