పల్లెలకు పాలనా సౌధాలు
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పాలనను చేరువచేసిన రాష్ట్ర సర్కారు మరో కొత్త నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ఇప్పుడు పంచాయతీలకు ఆధునిక హంగులతో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది.
- ఆధునిక హంగులతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
- ఒక్కో జీపీ కార్యాలయానికి 20 లక్షలు మంజూరు
- ఉమ్మడి జిల్లాలో 404 భవనాలకు 80.80కోట్లు
- ఆనందంలో పల్లె ప్రజలు
- సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పాలనను చేరువచేసిన రాష్ట్ర సర్కారు మరో కొత్త నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పల్లె ప్రగతితో గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చేయగా, ఇప్పుడు పంచాయతీలకు ఆధునిక హంగులతో సొంత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. ఒక్కో జీపీ ఆఫీసుకు 20లక్షల చొప్పున కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 404 గ్రామాల్లో కార్యాలయాలకు 80.80కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎం హన్మంతరావు తాజాగా లేఖను విడుదల చేయగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతగా పలు చోట్ల సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు.
కొత్తపల్లి, డిసెంబర్ 18 : పట్టణాలకు దీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్న రాష్ట్ర సర్కారు, ఇప్పుడు పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పాలనను చేరువచేసింది. ఆధునిక సమీకృత కలెక్టరేట్లను నిర్మించి, అందుబాటులోకి తెచ్చింది. అయితే మెజార్టీ గ్రామాల్లో పంచాయతీలకు సొంత భవనాలు లేవు. అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మరికొన్ని పంచాయతీ భవనా లు శిథిలావస్థకు చేరాయి. ఈ క్రమంలో పంచాయతీ పాలకవర్గం సమావేశాల నిర్వహణకు, రికార్డుల భద్రతకు, గ్రామ సభల నిర్వహణ ఇతర అవసరాల కోసం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ (ఎంజీఎన్ఆర్ఈజీ) నిధులతో ఒక్కొక్క గ్రామ పంచాయతీ నిర్మాణానికి 20 లక్షల చొప్పున కేటాయి స్తూ, పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ హన్మంతరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఉమ్మడి జిల్లాలో 404 భవనాలు..
కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాలని నిర్ణయించిన సర్కారు ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా 3, 686 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేసింది. ఇందులో కరీంనగర్ జిల్లాలో 117 జీపీలకు 23.40 కోట్లు, జగిత్యాల జిల్లాలో 117 జీపీలకు 23.40 కోట్లు, పెద్దపల్లి జిల్లాలో 88 జీపీలకు 17.60కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 82 జీపీలకు 16.40కోట్లు మంజూరు చేసింది. కాగా, పంచాయతీలకు ఒకేసారి ఇనిన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం ఇదే ప్రథమమని ప్రజా ప్రతినిధులు, పంచాయతీరాజ్‌శాఖ వర్గాలు పేర్కొంటున్నారు.
కరీంనగర్లో నిధులు మంజూరైన గ్రామాలు
చొప్పదండి మండలం ఆర్నకొండ, గుమ్లాపూర్, కోనేరుపల్లి, పెద్దకుర్మపల్లి, సాంబయ్యపల్లి, వెదురుగట్ట, గంగాధర మండలం బూరుగుపల్లి, చెర్లపల్లి (ఎన్), చెర్లపల్లి (ఆర్), చిన్న ఆచంపల్లి, గర్షకుర్తి, ఇస్లాంపూర్, కొండయ్యపల్లి, లక్ష్మీదేవపల్లి, లింగంపల్లి, మల్లాపూర్, ముప్పిడినర్సయ్యపల్లి, నర్సింహులపల్లి, తాడిజెర్రి, ఉప్పర్మల్యాల్, వెంకంపల్లి, రామడుగు మండలం చిప్పకుర్తి, దేశరాజ్‌పల్లి, గోపాల్రావుపేట, పందికుంటపల్లి, రుద్రారం, షానగర్, వెదిర, చిగురుమామిడి మం డలం గాగిరెడ్డిపల్లి, గునుకులపల్లి, కొండాపూర్, లంబాడిపల్లి, ముదిమాణిక్యం, నవాబ్‌పేట్, ఓగులాపూర్, పీచుపల్లి, సీతారాంపూర్, ఉల్లంపల్లి, సైదాపూర్ మండలం ఆకునూరు, ఆరెపల్లి, బొమ్మకల్, ఎక్లాస్పూర్, ఎలబోతారం, గుండ్లపల్లి, లస్మన్నపల్లి, నల్లరామయ్యపల్లి, రామచంద్రాపూర్, రాములపల్లి, రాయికల్ తండా, సోమారం, వెంకటేశ్వర్లపల్లి, ఇల్లందకుంట మండలం బోగంపాడ్, బూజునూర్, కనగర్తి, పాతర్లపల్లి, వంతడుపుల, హుజురాబాద్ మండలం బూతలపల్లి, జూపాక, కాట్రపల్లి, పోతిరెడ్డిపేట్, రాంపూర్, రంగాపూర్, జమ్మికుంట మండలం అంకూషాపూర్, నగురం, సైదాబాద్, విలాసాగర్, వీణవంక మండలం చల్లూర్, దేశాయ్‌పల్లి, ఎలబాక, కిష్టంపేట, కోర్కల్, మల్లారెడ్డిపల్లి, కరీంనగర్ రూరల్ మం డలం బొమ్మకల్, దుబ్బపల్లి, గోపాల్పూర్, ఇరుకుల్ల, జూబ్లినగర్, మందులపల్లి, కొత్తపల్లి మండ లం ఆసీఫ్‌నగర్, చింతకుంట, ఎలగందల్, ఖాజీపూర్, మల్కాపూర్, గన్నేరువరం మండలం చాకలివానిపల్లి, చీమలకుంటపల్లి, చొక్కారావుపల్లి, గన్నేరువరం, హన్మాజీపల్లి, ఖాసీంపేట, మైలా రం, సాంబయ్యపల్లి, యస్వాడ, మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి, గట్టుదుద్దనపల్లి, కల్లె డ, లింగాపూర్, నిజాయతీగూడెం, పెద్దూరుపల్లి, రంగంపేట, శంషాబాద్, వెగురుపల్లి, శంకరపట్నం మండలం అంబాలపూర్, చింతగుట్ట, గొల్లపల్లి, కల్వల, లింగాపూర్, ముక్త, మెట్పల్లి, మొలంగూర్, రాజాపూర్, తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి, గొల్లపల్లి, మల్లాపూర్, మక్తపల్లి, నర్సింగపూర్, పోలంపల్లి, తిమ్మాపూర్ గ్రామాల్లో పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించనున్నారు. కాగా, కొత్తపల్లి మండలంలోని ఐదు జీపీలకు నిధుల మంజూరుకు కృషిచేసిన మంత్రి గం గుల కమలాకర్‌ను ఆయా గ్రామాల సర్పంచులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ లకు నిధుల మంజూరుపై జగిత్యాల జిల్లా కోరుట్ల, మండలం జోగినపల్లి, మల్లాపూర్ మండలం కొత్తదా మరాజ్పల్లి, చిట్టాపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అభిమా నాన్ని చాటారు.
ప్రజలకు సత్వర సేవలు
కరీంనగర్ జిల్లాలోని 117 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవన నిర్మాణానికి 20 లక్షల చొప్పున మొత్తం 23.40 కోట్లు కేటాయించింది. గ్రామ కార్యాలయాలు అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఒకేసారి ఇన్ని పంచాయతీలకు నిధులు విడుదల చేయడం అభినందనీయం.
– వీరబుచ్చయ్య, డీపీవో కరీంనగర్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
కొత్తపల్లి మండలంలో ఆసిఫ్‌నగర్, చింతకుంట, ఎలగందల్, ఖాజీపూర్, మల్కాపూర్ గ్రామాల్లోని పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయిండచం హర్షనీయం. కృషిచేసిన మంత్రి గంగుల కమలాకర్‌కు మండల ప్రజలు రుణపడి ఉంటారు. భవనాలు పూర్తయితే ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందుతాయి. సభలు, సమావేశాలు నిర్వహించుకొనే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– పిల్లి శ్రీలతా మహేశ్‌గౌడ్, కొత్తపల్లి ఎంపీపీ
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

