Yadava Charitable Trust | పెద్దపల్లి, డిసెంబర్20: యాదవ చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. యాదవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో గత మూడు నెలలు వాలంటీర్లగా పని చేసిన కే స్వాతి, డ సుజాత, జీ సరోజన, కే రాజేంద్ర ప్రసాద్లను అభినందిస్తూ శనివారం కలెక్టరేట్లో వారికి ఎక్స్పిరియన్స్ సర్టిఫికేట్లు అందజేశారు.
భవిష్యత్తులో కూడా యాదవ చారిటబుల్ ట్రస్టు మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ మారం తిరుపతి యాదవ్, ఉపాధ్యాక్షుడు చిలారపు పర్వతాలు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.