మంథని రూరల్, నవంబర్ 27 : మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహులుగా ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు నామినేషన్లను వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముహూర్త బలాలు చూసుకుంటూ నామినేషన్ వేసేందుకు అభ్యర్థుల సిద్ధమవుతున్నారు. మంథని మండలంలో 35 గ్రామపంచాయతీల్లో పోటీలో ఉండే సర్పంచ్, వార్డ్ మెంబర్ అభ్యర్థులు వారికి కేటాయించిన క్లస్టర్లలో నామినేషన్లను అందజేస్తున్నారు.
మంథని మండలంలో మొట్టమొదటి సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నాయకురాలు కనవేన స్వప్న శ్రీనివాస్ తన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గ్రామపంచాయతీలకు సంబంధించిన ఆశావాహులు సైతం అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మొదటి నామినేషన్ దాఖలు చేసిన కనివేన స్వప్న శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి ప్రభావిత గ్రామమైన రాచ్చపెల్లి గ్రామంలోని సమస్యలు బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సహకారంతో తను సర్పంచ్ గా ఉండి సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దగ్గర పడుతున్న ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తనకు అవకాశం ఇస్తే గ్రామ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మద్దతుదారులు ఉన్నారు.