Veenavanka | వీణవంక, డిసెంబర్ 22 : ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సోమవారం కన్నుల పండువగా, పండుగ వాతావరణంలో కొలువుదీరాయి. వీణవంక మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయితీలకు గాను ఒకటి ఏకగ్రీవం కాగా మిగిలిన 25 గ్రామ పంచామతీలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా గెలుపొందిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు పదవీబాధ్యతలు చేపట్టారు.
ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు జడల రమేష్, మహాకళ ఉమ, అందె శ్రీమతి, గజ్జెల మొగిలయ్య, ఎం. తిరుపతిగౌడ్, చంద్రమౌళి, గాజుల శంకర్, బావు సంపత్, దాసారపు సరోజన, జడల శ్రీకాంత్, వీరస్వామి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, రామిడి సంపత్‌రెడ్డి, చొప్పరి సారమ్మ, కర్ర విజయ, దూడపాక శ్రీవేణి తదితరులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. కాగా ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో గ్రామస్థులు సర్పంచులతో పాటు ఇతర పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.