Collector Koya sriharsha | పెద్దపల్లి రూరల్ జనవరి 19: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని, ప్రజల మౌలిక వసతుల కల్పనకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పెద్దపల్లి కలెక్టర్ కోయశ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ల కు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కు డీపీవో వీరబుచ్చయ్య పూల మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం సర్పంచ్ లను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాల నిధులను సక్రమంగా వినియోగించుకుని ప్రజల మౌలిక అవసరాలు తీర్చే దిశగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య, డీఎల్ పీవో దేవకీదేవి, పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ ఆయా మండలాల ఎంపీడీవోలు, ఏంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పెద్దపల్లి పాలకుర్తి, కమాన్ పూర్, కాల్వశ్రీరాంపూర్ సుల్తానాబాద్ ఓదెల మండలాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు.