Saidapur | సైదాపూర్, ఆగస్టు 20: సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్యలో చౌరస్తా సర్కిల్ వద్ద నీళ్లు నిలవడంలోబురదమయమైంది.
దీంతో బురదలో దోమలు వల్ల జ్వరాలకు గురవుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు బురదలో నాటు వేసి నిరసన తెలిపారు. ఈగలు దోమలు చుట్టుపక్కల ఇండ్లలో ఉన్నవాళ్లకు జ్వరాలు వస్తున్నాయని, సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేశారు.