జగిత్యాల : ధాన్యం కొనుగోలు ( Purchasing grain ) ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ (Collector B. Satya Prasad ) సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం తహసీల్దార్ల తో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ధాన్యంతో వచ్చిన లారీలను మిల్లుల వద్ద 24 గంటల్లో అన్లోడ్ చేసి పంపించాలన్నారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పురోగతి, ధాన్యం నిల్వలు, రవాణా, హమాలీలు, గన్నీ బ్యాగుల సరఫరా తదితర అంశాలపై అధికారులను సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలోని ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, నీడ, టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, మిల్లర్లు, ట్రాన్స్ పోర్ట్ యాజమాన్యాలు సమన్వయంతో పని చేసి కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల వద్ద పారదర్శకత పాటించాలని సూచించారు.