కమాన్చౌరస్తా, ఏప్రిల్ 12: ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కరీంనగర్లోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను అభినందించి మాట్లాడారు. అంకిత భావంతో కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని విద్యార్థులు నిరూపించారన్నారు.
సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీలో బీ శశికుమార్, కే మైత్రి, యూ చారుహాసిని 995 మార్కులు, ఎం సాత్విక, శ్రీ శ్రీనిత్వ, డీ ప్రవళిక 994 మార్కులు సాధించారని చెప్పారు. అలాగే, 20 మంది విద్యార్థులు 990కి పైగా మార్కులు సాధించగా, బైపీసీలో బీ లహరి, శ్రీనివాసన్, సీహెచ్ కార్తీక్ 994 మార్కులు సాధించినట్టు తెలిపారు. 18 విద్యార్థులు 980కి పైగా మార్కులు, ఎంఈసీలో రాజయ్య 974, సీఈసీలో అంజలి 984 మారులు సాధించినట్టు వివరించారు.
అలాగే ఫస్టియర్ ఫలితాల్లో ఎంపీసీలో బీ ప్రశాంత్ గౌడ్ 468, జీ అక్షర, ఈ అక్షయ, కే గిఫ్టి, ఎం కళ్యాణి 467 మార్కులు, పది మంది విద్యార్థులకు 466, 44 విద్యార్థులకు 461 మార్కులు వచ్చాయన్నారు. బైపీసీలో డీ మేఘన, ఏ సిద్ధార్థ్ 438, డీ మనోజ్ఞ 437 మార్కులు సాధించగా, ఎనిమిది మంది విద్యార్థులు 431 సాధించారని వివరించారు. ఎంఈసీలో పీ లిఖిత గుప్త 494, సీఈసీలో సీహెచ్ శివాత్మిక రెడ్డి 490 మారులు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ శ్రీ చైతన్య కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ణ, మోహన్రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు ఉన్నారు.