ఎంపీల గ్రూప్ ఫొటోలో మంత్రులు మిస్!.. అర్వింద్ ట్వీట్‌పై ఆసక్తికర చర్చ
ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో బీజేపీ తెలంగాణ ఎంపీలు దిగిన ఫొటోలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు లేకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. బీజేపీ ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, గోడం నగేశ్‌తో కలిసి ఉన్న ఫొటోను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ‘ఎక్స్' వేదికగా పంచుకున్నారు.
- తెలంగాణ బీజేపీలో కొత్త కుంపటి!
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో బీజేపీ తెలంగాణ ఎంపీలు దిగిన ఫొటోలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు లేకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. బీజేపీ ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, డీకే అరుణ, గోడం నగేశ్‌తో కలిసి ఉన్న ఫొటోను నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోకు ‘టుగెదర్‌నెస్’ అని క్యాప్షన్ ఇచ్చి కమలం పువ్వు గుర్తును ట్యాగ్ చేశారు. ఆరుగురు ఎంపీలు ఉన్న ఈ ఫొటోలో ఇద్దరు కేంద్ర మంత్రులు లేకపోవడం ఆ పార్టీలో కొత్త కుంపటికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అర్వింద్, ఈటలతో మొదటినుంచి బండి సంజయ్‌కి గ్యాప్ ఉన్నదనే చర్చ నడుస్తుంది. ఇటీవల ఈటల-బండి మధ్య రాజీ కుదిర్చేందుకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అభయ్‌పాటిల్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ భేటీ తర్వాత కూడా బండి-ఈటల ఎక్కడా కలిసి పార్టీ కార్యక్రమాలు కానీ, ప్రెస్మీట్లు కానీ నిర్వహించలేదు. ఇలాంటి సమయంలో ఢిల్లీ వేదికగా తామంతా ఒకటి అంటూ అర్వింద్ ట్వీట్ చేయడం అందులో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ లేకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన బీజేపీ నేతల బృందంలో సైతం కిషన్‌రెడ్డి, బండి లేకపోవడం గమనార్హం.
ఎంపీల ఫొటోపై నెటిజన్ల ఫైర్
అర్వింద్ ట్వీట్ చేసిన ఫొటోలో బీజేపీలోకి వలస వచ్చిన నేతలంతా ఉన్నారని ఆరెస్సెస్ నేపథ్యం ఉండి.. మొదటినుంచి పార్టీలో ఉన్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎక్కడ..? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ర్టాభివృద్ధికి మీరు చేసింది ఏమిటి? అని ఎంపీలను నెటిజన్లు నిలదీస్తున్నారు. తెలంగాణకు బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, మెట్రో ఫేజ్-2 నిధులు, ఐటీఐఆర్, కృష్ణా జలాలకు శాశ్వత పరిష్కారంపై కేంద్రాన్ని నిలదీయాలని సూచిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయకపోతే రాష్ర్టానికి మీ వల్ల ఏం ఉపయోగం అని వ్యాఖ్యానిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

