Pink Army | కథలాపూర్, ఏప్రిల్ 20 : గులాబీ దళం బలమేంటో చూపించే సమయం ఆసన్నమైందని… బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు కథలాపూర్ మండల కేంద్రం నుండి కార్యకర్తలు తరలి వెళ్లాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. కథలాపూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 27 ఆదివారం ఛలో వరంగల్ ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ వద్ద కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలందరూ కలిసికట్టుగా రావాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, బహిరంగ సభ వేదిక ద్వారా కెసిఆర్ ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.
అనంతరం మండల నాయకులతో కలిసి బహిరంగ సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో మండల ప్రజాపతినిధులు మామిడిపల్లి రవి, గండ్ర కిరణ్ రావు, గడ్డం భూమారెడ్డి, సోమ దేవేందర్ రెడ్డి, విద్యాసాగర్ రావు, గంగారెడ్డి, జలంధర్ , రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.