Godavarikhani | పీటీ స్వామి మృతి సమాజానికి తీరని లోటు.. ఇప్టా జాతీయ సమితి సభ్యుడు కే స్వామి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మినారాయణ
పూర్వ ఉపాధ్యాయుడు, టీబీజీకేఎస్, ఈశ్వరకృప వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పీఈటీ స్వామి మృతి విద్యా, సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు సమాజానికి తీరని లోటని ఇప్టా జాతీయ సమితి సభ్యుడు కవ్వంపల్లి స్వామి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మినారాయణ అన్నారు.
Godavarikhani | కోల్ సిటీ, అక్టోబర్ 27 : పూర్వ ఉపాధ్యాయుడు, టీబీజీకేఎస్, ఈశ్వరకృప వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పీటీ స్వామి మృతి విద్యా, సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు సమాజానికి తీరని లోటని ఇప్టా జాతీయ సమితి సభ్యుడు కవ్వంపల్లి స్వామి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నం లక్ష్మినారాయణ అన్నారు. దుర్గానగర్‌లోని ఆయన కుమారుడు పీఎస్ అమరేందర్ నివాసంలో పీటీ స్వామి చిత్రపటానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
పీటీ స్వామి తమకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా సాహిత్య, నాటక రంగాల వైపు నడిపించి, జీవితాలకు మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. 60వ దశకంలోనే ఆయన రచించిన ‘పురోగమనమా! ఇది తిరోగమనమా!’ కవితా సంకలనం ద్వారా సామాజిక అవగాహన కల్పించారని గుర్తుచేసుకున్నారు. అన్ని రంగాల వారితో గౌరవాభిమానాలు పొందిన అజాతశత్రువుగా ఆయన సేవలను కొనియాడారు. భౌతికంగా దూరమైనా ఆయన అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో పీటీ స్వామి కుటుంబ సభ్యులు, ఈశ్వరకృప వృద్ధాశ్రమ డైరెక్టర్ సత్తయ్య, సీనియర్ పాత్రికేయులు మేజిక్ రాజా, లఘుచిత్ర దర్శకుడు చంద్రపాల్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jio Platforms | జియో ప్లాట్‌ఫామ్స్ లిస్టింగ్.. కీలకమైన అంశాలు ఇవే..!
ఈ-వ్యర్థాలపై విద్యార్థులకు అవగాహన
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పట్టభద్రుల ఓటరు నమోదు
Harish Rao | రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడికే అపాయింట్మెంట్ లేదు.. ఇదెక్కడి ప్రజాపాలన..? : హరీశ్ రావు
Ramayana | ‘రామాయణ’ పాటలపై విమర్శలు.. స్పందించిన ఏఆర్ రెహమాన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

