Padmasali Sangam | కోరుట్ల, జూన్ 12: ఓబీసీల పోరు బాట పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పద్మశాలీ కులోన్నతి సంఘ భవనంలో పుస్తకావిష్కరణ పోస్టర్ ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన బీసీ వర్గాలు ఎదుర్కుంటున్న సమస్యలు వాటి పరిష్కారాలు లక్ష్యంగా మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపళ్ల నరహరి, హైకోర్టు న్యాయవాది పృధ్వీరాజ్ సింగ్ రచించిన ఓబీసీల పోరు బాట పుస్తకావిష్కరణ ఈనెల 14న హైద్రాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
అన్ని కులాల ఓబీసీ సంఘం నాయకులు రాజకీయాలకు అతీతంగా హజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు గుంటుక ప్రసాద్, బోగ వెంకటేశ్వర్లు, సాంబార్ ప్రభాకర్, జిల్లా ధనుంజయ్, కటుకం గణేష్, మిట్టపల్లి రమణ, బాలే అజయ్ తదితరులు పాల్గొన్నారు.