వినాయక లడ్డూలంటే భక్తులకు సెంటిమెంట్. అందుకే వేలంలో లడ్డూలను దక్కించుకునేందుకు పోటీ ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సారి గణపతి మండపాల మండపాల లడ్డూలకు ఈ సారి భారీ డిమాండ్ కనిపించింది. కరీంనగర్లో ప్రతి సంవత్సరం లక్ష వరకే ఉండే ఈ వేలం, ఈసారి ఏకంగా రెండు లక్షలు దాటింది. లక్ష్మీనగర్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన గణాథుడి వద్ద లడ్డూను పాకంటి లక్ష్మీకల్పన-తిరుపతి దంపతులు 2.26 లక్షలకు దక్కించుకున్నారు.
అలాగే, రాంనగర్ ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో 51 కిలోల లడ్డూను వేల్పుకొండ రాజ్‌కుమార్ 1,25,016కు చేజిక్కించుకున్నారు. విద్యానగర్ విజయదుర్గా కాలనీలో సంజు అశోక్ 1.25 లక్షలకు, కోతిరాంపూర్‌లో కొరివి కిషన్ 50 వేలకు దక్కించుకున్నారు. జగిత్యాలలో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద అంబారిపేటకు చెందిన అన్నమనేని సంతోష్ రావు, అజిత 1,77,300కు లడ్డును తీసుకు న్నారు. అలాగే లక్ష్మీ గణేశ్ మందిరంలో గణపతి లడ్డూ 1,34,116కు లవంగ రంజిత్ దక్కించుకున్నారు.