Importance of BCs | చిగురుమామిడి, సెప్టెంబర్ 3: చట్టసభల్లో బీసీల ప్రాధాన్యత పెరగాలని, ప్రజా ప్రతినిధుల ప్రాతినిధ్యం మెరుగుపడాలని బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు శ్రీ రామోజు రాజ్ కుమార్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలలో బీసీ వాదం బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ గ్రామాన బీసీ సంఘాన్ని పటిష్టపరిచి బీసీలను అధిక సంఖ్యలో గెలిపించుకోవాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, డైరెక్టర్ తాళ్లపల్లి తిరుపతి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు చెల్పూరి విష్ణమాచారి, నాయకులు రాజకుమార్, మల్లికార్జున్, శ్రీనివాస్, లింగం, రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిగురుమామిడి గ్రామ శాఖ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సిరవేణి సంపత్ కుమార్, కార్యదర్శిగా పోతర్ల శివాంజనేయులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.