గోదావరిఖని/ అంతర్గాం సెప్టెంబర్ 23: రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టి రోజు సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి అరుదైన కానుక ఇచ్చారు. మంత్రి కేటీఆర్ జన్మదినం గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా ఇంటిని నిర్మించి ఇచ్చారు. శనివారం వారితో గృహప్రవేశం చేయించారు. అలాగే అంతర్గాం మండలంలోని గోలివాడ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు 30 మందికి ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రామగుండం కార్పొషన్ పరిధి 37వ డివిజన్‌కు చెందిన నిరుపేద కొండ రాజేశ్వరి నివసించేందుకు ఇల్లులేదు.
తన ఇంటి సమీపంలో ఉండే ఆమె దయనీయస్థితిని తెలుసుకున్న చందర్ కొన్ని నెలల కిందట రూ. లక్ష వెచ్చించి ఇంటిని నిర్మించిఇచ్చాడు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా వారితో రిబ్బన్ కట్ చేయించి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్వరి తనకు ఇల్లు నిర్మించి ఇచ్చిన కోరుకంటికి మనసారా కృతజ్ఞతలు తెలిపింది. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నది.
ఆయాచోట్ల కార్యక్రమాల్లో నగరపాలక డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు పెంట రాజేశ్, పాముకుంట్ల భాస్కర్, నాయకులు చెలకలపల్లి శ్రీనివాస్, జేవి రాజు, మెతుకు దేవరాజ్, దొమ్మెటి వాసు, సతీశ్, శ్రీనివాస్, ఇంజపురి నవీన్, దాసరి శ్రీనివాస్,. కారం వినయ్, నర్సింగరావు, సంధ్యారెడ్డి, వేణు, కుమార్, రంజిత్, ఓదెలు, తిమోతి ఉన్నారు. అంతర్గాం మండల వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచ్ ధరని రాజేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తిరుపతి నాయక్ పాల్గొన్నారు.