polytechnic education | పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి.. ఎస్ఎఫ్ఐ
శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
- శక్తి స్కీమ్-జీవో నెం.97 రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ పోరాటం
polytechnic education | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 20 : శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఎస్ఎఫ్ఐ నాయకుడు మల్లారపు ప్రశాంత్ ఆరోపించారు. ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తోందని విమర్శించారు.
ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపకుల నియామకాలు, ప్రయోగశాలల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. శక్తి స్కీమ్, జీవో నెం.97ను రద్దు చేసి, పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని కోరారు. ఎస్బీటీఈటీని శక్తి స్కీమ్ ప్రభావం నుంచి రక్షించాలని, విద్యార్థుల భవిష్యత్‌తో ప్రయోగాలు చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

