Sanjeev Goenka | పంత్ మనస్తత్వం పిల్లోడి మాదిరి.. త్వరలోనే కలిసి డిన్నర్ చేస్తాం..!
Sanjeev Goenka : ఐపీఎల్ జట్టు యజమానుల్లో లక్నో సూపర్ జెయింట్స్ బాస్ సంజీవ్ గొయెంకా(Sanjeev Goenka) మిగతా వాళ్లలా కాదని తెలిసిందే. మ్యాచ్ సమయంలోనే కెప్టెన్లపై నోరు పారేసుకొని వార్తల్లో నిలిచే ఆయన తాజా ఇంటర్వ్యూలో రిషభ్ పంత్ (Rishabh Pant) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Sanjeev Goenka : ఐపీఎల్ జట్టు యజమానుల్లో లక్నో సూపర్ జెయింట్స్ బాస్ సంజీవ్ గొయెంకా(Sanjeev Goenka) మిగతా వాళ్లలా కాదని తెలిసిందే. మ్యాచ్ సమయంలోనే కెప్టెన్లపై నోరు పారేసుకొని వార్తల్లో నిలిచే ఆయన తాజా ఇంటర్వ్యూలో రిషభ్ పంత్ (Rishabh Pant) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంతొమ్మిదో సీజన్ అనంతరం పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు ఇచ్చేయడంపై విమర్శలు వచ్చినా.. మంచి వాతావరణంలోనే ఆ నిర్ణయం తీసుకున్నామని గొయెంకా తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీలో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ టైటిల్ కోసం నిరీక్షిస్తోంది. కెప్టెన్లను మారుస్తున్నా.. లోగో, జెర్సీ రంగు మార్చినా ఆ జట్టు కథ మారలేదు. ఈ నేపథ్యంలో 19వ సీజన్ సారథి రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇచ్చేసింది లక్నో. వచ్చే సీజన్‌కు కొత్త కెప్టెన్ వేటలో ఉన్న ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గొయెంకా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పంత్ గురించి కొన్ని విషయాలు చెప్పాడు.
Dr. Sanjeev Goenka Sir on Rishabh Pant :-
“I’m very fond of him. He’s such an innocent and childish person.” ❤️ pic.twitter.com/5roLB8tbkO
— Super Giants Army (@LSGFansClub) September 13, 2026
‘పంత్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు అమాయకుడు. అతడి మనస్తత్వం చిన్న పిల్లోడి మాదిరిగా ఉంటుంది. 19వ సీజన్ తర్వాత అతడిని ఢిల్లీకి అప్పగించడం అనేది మంచి వాతావరణంలోనే జరిగింది. చివరిసారి మేము మాట్లాడుకున్నప్పుడు ఇదొక్కటే విషయం కాకుండా ఇతర అంశాలు చర్చించాం. ఢిల్లీ తరఫున అతడు రాణించాలని కోరుకుంటున్నా. త్వరలోనే మేమిద్దరం డిన్నర్ చేయబోతున్నాం’ అని గొయెంకా వెల్లడించాడు.
మరీ చవకగా..
ఐపీఎల్ 18వ సీజన్ మెగా వేలంలో పంత్‌ను ఏకంగా రూ.27 కోట్లకు కొన్నది లక్నో. కానీ, అతడి సారథ్యంలోనూ ఆ జట్టు నిరాశపరిచింది. పంతొమ్మిదో సీజన్లో అయితే మరీ చెత్త ఆటతో అట్టడుగున నిలిచింది. దాంతో.. పంత్‌పై వేటు వేసింది లక్నో. అతడు కూడా ఫ్రాంచైజీ మారాలని అనుకున్నాడు. పరస్పర ఆమోదంతో లక్నో, ఢిల్లీ మధ్య మార్పిడి ఒప్పందం జరిగింది. ఈ అగ్రిమెంట్లో భాగంగానే రూ.15 కోట్లకే పంత్‌ను ఢిల్లీకి ఇచ్చేసి.. కుల్దీప్ యాదవ్‌ను రూ.13.5 కోట్లకు తీసుకుంది ఎల్ఎస్జీ. మెగా వేలంలో లక్నో కొన్న ధరతో పోలిస్తే.. పంత్‌ను ఢిల్లీ చవకగానే దక్కించుకుంది.
🚨 Announcement 🚨
Rishabh Pant and Kuldeep Yadav complete high-profile trade between @DelhiCapitals and @LucknowIPL.
Rishabh Pant all set to rejoin #DC at INR 15 Crore whereas Kuldeep Yadav will join #LSG at INR 13.5 Crore.
More Details ▶️ https://t.co/64HeOX143I… pic.twitter.com/tIEvj7fgNo
— IndianPremierLeague (@IPL) June 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

