రఘునాథపాలెం ( ఖమ్మం ) : కాంగ్రెస్ మాటల ప్రభుత్వమే తప్ప, చేతల ప్రభుత్వం కాదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Puvvada Ajay Kumar ) అన్నారు.
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Government ) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ( KCR ) రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరో పించారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోవడం వంటి పాత కాంగ్రెస్ రోజుల నాటి దుస్థితి మళ్లీ పునరావృతమైందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులు దర్జాగా పొలాల్లో పనిచేసుకునే వారని, కానీ నేడు యూరియా బస్తాల కోసం యాప్ల పేరుతో రైతులను క్యూ లైన్లలో నిలబెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు .
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, రైతులకు నిజమైన భరోసా దక్కిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు యాసా రామారావు, ఆర్జెసీ కృష్ణ,గుత్తా రవి,మాధంశెట్టి హరిప్రసాద్, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, పిన్ని కోటేశ్వర రావు, చెరుకూరి ప్రదీప్,దొంతు సత్యనారాయణ, హనుమంత్ రావు, ఎల్లబాబు,గోవర్ధన్, రవి,వినోద్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.