Jagadish Reddy | సాగర్ ఆయకట్టు కింద నీటి విడుదల చేయాలి : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy | నాగార్జున సాగర్ ఆయకట్టు కింద వెంటనే నీటి విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.
నల్లగొండ : నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar) ఆయకట్టు కింద వెంటనే నీటి విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) డిమాండ్ చేశారు. ఇందుకుగాను నీటి విడుదల షెడ్యూల్ ను ప్రకటించాలని కోరారు. నల్గగొండలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సాగర్ ఎడమ కాల్వకు షెడ్యూల్ ప్రకటించకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పాదయాత్ర చేస్తారని స్పష్టం చేశారు. రైతులు సాగర్ ఆయకట్టు కింద పూర్తి స్థాయిలో మొత్తం నాట్లు వేయాలని, నీళ్ల కోసం తామంతా పోరాటాలు చేస్తామని వెల్లడించారు. మొత్తం ఆయకట్టుకు ప్రభుత్వం నీళ్లు ఇవ్వాల్సిందేనని అన్నారు. నీళ్లు ఇవ్వకపోతే ప్రభుత్వ అంతు చూస్తామని హెచ్చరించారు.
రైతులు బాధలు పడుతుంటే ముఖ్యమంత్రి పైశాచికనందం పొందుతున్నారని విమర్శించారు. మంత్రులకు సోయి లేదని, ఇకపై బడిత పూజ చేయాల్సిందేనని అన్నారు. ఆంధ్ర నీటి దోపిడీపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీ ( KRMB) కి లేఖ కూడా రాయలేదన్నారు.
భూ భారతి పేరుతో భూములను కొల్లగొడుతున్నారని, ముఖ్యమంత్రి మంత్రులు అందరూ దోచుకునే పనిలోనే ఉన్నారని ఆరోపించారు. కోటికి పైగా ఎకరాలను బ్లాక్ లో పెట్టి 22ఏ పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటివరకు 200 టీఎంసీలను దోచుకుని పోయాడని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

