Pegadapally | పెగడపల్లి : పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. పెగడపల్లి మండలం నామాపూర్ లో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి బుర్ర రాములు గౌడ్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో మండలంలోని అన్ని గ్రామాలలో ఇండ్లు లేని నిరుపేద లందరికీ ఇండ్లు మంజూరు చేయించి పేదలందరికీ సొంతింటి నిర్మాణ కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అదేవిధంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గృహలక్ష్మి, రూ.500 కు సిలిండర్, రైతులందరికీ రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనతో పాటు పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ, కార్డు లేని పేదవారికీ రేషన్ కార్డులు మంజూరు చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కారుదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చాట్ల విజయభాస్కర్, చెట్ల కిషన్ మండల నాయకులు సంధి మల్లారెడ్డి, కడారి తిరుపతి, ముదిగంటి పవన్ రెడ్డి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి కొల్లూరు రమేష్, తోట రామ్ రెడ్డి, సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.