Peddapally | పెద్ద పల్లి టౌన్, మార్చి 23 : యాదవులకు ప్రభుత్వం అందించిన మార్కెట్ స్థలాలను కాపాడాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపెళ్లి గ్రామ శివారులో యాదవుల కోసం కేటాయించిన మార్కెట్ స్థలాన్ని అక్రమ దారుల నుండి కాపాడి ప్రభుత్వమే రక్షణ చర్యలు తీసుకోవాలని గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు పలువురు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం గొంగడి ధర్నా పేరుతో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యాదవుల ఐక్యత చాటుతూ చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చీరాల పర్వతాలు జిల్లా అధ్యక్షులు సలేందుల రాములు, పరుస సమ్మయ్య, సతీష్ యాదవ్‌తో పాటు పలువురు అధిక సంఖ్యలో యాదవులు, కురుమలు పాలొగొన్నారు.