Huzurabad MLA Kaushik Reddy | సిర్సపల్లిలో డంపు యార్డ్ రద్దు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి 24 గంటల దీక్ష
డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం మరింత ఉదృతమవుతోంది. మంగళవారం నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- హుజురాబాద్లో 24 గంటల దీక్ష చేపట్టిన ఎమ్మెల్యే పాడి
Huzurabad MLA Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 7 : సిర్సపల్లిలో ఏర్పాటు చేయనున్న డంపు యార్డ్ రద్దు చేయాల్సిందేనని, లేకుంటే ఆందోళన తప్పదని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డంప్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమం మరింత ఉదృతమవుతోంది. మంగళవారం నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్షలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరులను స్మరించుకుని నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమాలు ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.
ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడటమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం, భవిష్యత్, పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఈ నిరసనకు విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున మహిళలు స్వచ్చందంగా ముందుకు వచ్చి దీక్షలో పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు, యువత, మహిళలు దీక్షా తరలివచ్చి ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ దీక్షా శిబిరానికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

