siricilla | సిరిసిల్ల రూరల్, జూన్ 21: తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంట య్య మృతి తీరని లోటు అని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. నాలుగు రోజుల క్రితం కుంటయ్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు కుంటయ్య కుటుంబాన్ని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాల లు వేసి నివాళులు అర్పించారు. కుంటయ్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రూ. 10 వెలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి అర్ ఏస్ మండల అధ్యక్షుడు రాజన్న, సింగిల్ విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్,మాజీ జడ్పీటీసీ కోడి అంత య్యా, ప్రజా ప్రతినిధులు మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, అడ్డగట్ల భాస్కర్, కుర్మా రాజయ్య, క్యారం పర్శరాములు, తదితరులు ఉన్నారు.