korukanti Chandar | అంతర్గాం, జూన్ 30 : పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం వందేళ్ల ప్రగతి సాధించిందని, అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన రెవంత్ సర్కార్ ప్రజలను అగం చేస్తుందని, తెలంగాణకు తొలి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పెద్దంపెట గ్రామంలో శనివారం తెలంగాణకు కేసీఆర్ పాలన శ్రీరామ రక్ష కార్యక్రమం నిర్వహిం చారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం కోరుకంటి మాట్లాడుతూ అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెం టీలు అమలు చేయడం పక్కన పెట్టి రాష్ట్రాన్ని మళ్లీ ఆగం పట్టిస్తుందని విమర్శించారు. ఇప్పటి దాకా ఆరు గ్యారంటీలను అమలు చేయలేక రోజుకో నాటకామాడుతోందని విమర్శించారు. పదేళ్లలో అద్భుత రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రతీ ఇంటికి సంక్షేమం ప్రతీ ముఖంలో అనందం నింపింది కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమేనన్నారు. వృద్ధ, వికాలాంగుల, వితంతువులకు అండగా కేసీఆర్ అండగా నిలిచారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతుభరోసాతో ప్రజలను మాయ చేస్తున్నదన్నారు. వచ్చే స్థానిక సమరంలో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేం దుకు వేచి చూస్తున్నారని, రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల సమరంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు గులాబీ సైనికులు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టి వస్తే ఆరు గ్యారెంటీల పై నిలదియాలన్నారు.
అంతర్గాం బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కోల సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ, మాజీ ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి మాజీ సర్పంచులు బండారి ప్రవీన్ ధర్మాజీ కృష్ణ, మెరుగు పోచం, కొల్లూరి సతీష్, ధరణి రాజేష్, నాయకులు ఆర్శనపల్లి శ్రీనివాస్, సందెల మల్లయ్య, బొడ్డుపల్లి శ్రీనివాస్, నారాయణదాసు మారుతి పుట్ట శ్రీనివాస్ యాదవ్, కరివేద రాజిరెడ్డి,కరివేద శ్రీనివాస్ రెడ్డి, బండి శ్రీనివాస్ గౌడ్, ఆములసరన్, మెరుగు రమేష్ గౌడ్, బండి మహేష్ గౌడ్, కోల మధుకర్, కోల స్వామి, మాటేటి రవి, సందనవేణి సాయి, నోముల విజేందర్ రెడ్డి, బండి వీరయ్య గౌడ్, తమ్మినవేని గంగయ్య, మెరుగు శ్రీనివాస్ గౌడ్, తమ్మనవేని కనకయ్య, బండి ఐలయ్య గౌడ్, తమనవేణి పోచం, బోనాల లింగయ్య, ఆడెపు శంకర్, గుండా పోచం, రాజలింగు, పల్లె రాజయ్య, అరిగిల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.