కార్పొరేషన్, మే 16: కాంగ్రెస్ సర్కారు వడ్లకు రూ. 500 బోనస్ ఇచ్చేదాకా పోరాడతామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ అధినేత పిలుపు మేరకు ఎమ్మెల్యే నివాసం లో గురువారం రైతు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముం దు అబద్ధపు హామీలతో కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిందని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా మద్దతు ధరకు అదనంగా రూ.500ల బోనస్ ఇస్తామ ని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నదని విమర్శించారు. ఓట్లు డ బ్బాల్లో పడగానే సీఎం రేవంత్‌రెడ్డి మాట మా ర్చాడని విమర్శించారు. సన్న రకానికే రూ.500 బో నస్ ఇస్తానని చెప్పడం రైతులను మోసం చేయడమేనన్నారు. సర్కారు నిర్లక్ష్యంతోనే ధాన్యం కోనుగోలు స జావుగా సాగడం లేదన్నారు.
తాము అధికారంలో ఉ న్నప్పుడు 95 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు. తెలంగాణలో పంట దిగుబడి తగ్గిందా? లేదంటే రైతు లు దళారులకు అమ్ముకున్నారా? చెప్పా లని ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగో లు చేయాలన్నారు. లేదంటే రైతుల ఆగ్రహాన్ని ప్రభు త్వం చవిచూడక తప్పదని కార్యక్రమంలో మే యర్ యాదగరి సునీల్‌రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, ఎంపీపీ లక్ష్మయ్య, వైస్‌ఎంపీపీ తిరుపతినాయ క్, నేతలు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, సర్వర్, శ్రీనివాస్‌రెడ్డి, రెడ్డవేని మధు, పొన్నం అనిల్, బుర్ర తిరుపతిగౌడ్, మంద రాజమల్లు, గంగాధర చందు తదితరులు ఉన్నారు.