Husnabad | చిగురుమామిడి, సెప్టెంబర్ 8: రైతులకు సరిపడా యూరియా దిగుమతి చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం ప్రధానమంత్రి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. యూరియా సరిపడా రైతులకు ఇవ్వాలని, లేనిచో కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు పోలు స్వప్న, అన్ని గ్రామాల నాయకులు పాల్గొన్నారు.