Chada Venkat Reddy | చిగురుమామిడి, మే 25: కేంద్రం అవలంబిస్తున్న ఒంటెద్దు పోకడలను మానుకోవాలని సీపీఐ జాతీయ నేత వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై శాంతి చర్చలు జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా ప్రభుత్వాన్ని మొట్టమొదటిసారిగా కోరినట్లు తెలిపారు. ఎర్రగుట్ట ఎన్కౌంటర్ పై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని సీపీఐ డిమాండ్ చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరువేతకు కేంద్రం తీసుకునే చర్యలకు సీపీఐ సమర్థిస్తుందన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ప్రజాసంఘాలు, మేధావులు కోరుకున్నప్పటికీ కేంద్రం ఒంటెద్దు పోకడలతో పట్టించుకోవడం లేదన్నారు. అమాయక ఆదివాసులు ఎన్కౌంటర్లో చనిపోతున్నారని చాడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తుందని అన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
73, 74 రాజ్యాంగం ద్వారా రావలసిన గ్రామాలకు నిధులు నిలిచిపోయాయని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందే స్వామి, బోయిని అశోక్, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్ రెడ్డి, బోయిని పటేల్, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.
27, 28న సిపిఐ జిల్లా మహాసభలు..
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కరీంనగర్ జిల్లా 23 మహాసభలు 27, 28వ తేదీలలో కరీంనగర్లోని మధు గార్డెన్లో నిర్వహించడం జరుగుతుందని సీపీఐ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, సహాయ కార్యదర్శి బూడిద సదాశివ తెలిపారు. మహాసభల కరపత్రాన్ని నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ చివర్గ సభ్యులు కలవేన శంకర్ హాజరుకారున్నారని తెలిపారు. ఈ మహాసభను విజయవంతం చేయాలని నాయకులను కోరారు.