Education | తిమ్మాపూర్, జూన్ 13: ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ కొండయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులతో పాఠశాలలో ఉన్న సరస్వతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షరాభ్యాసం చేయించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని నైపుణ్యాలు కలిగిన విద్యను అందుకు చాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు బతకాలంటే గ్రామస్తుల సహకారం ఉండాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, నుస్తులాపూర్ సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రవీందర్ రెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్, జిల్లా అధికారి కృపారాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ఆవుల సంపత్, పాఠశాల ఎసెంసీ చైర్మన్ పురం లక్ష్మి, నాయకులు గుజ్జుల ప్రణీత్ రెడ్డి, తిరుపతిరెడ్డి, మాచర్ల అంజయ్య, దావ సంపత్ రెడ్డి, సంగుపట్ల మల్లేశం, ఎడ్ల భూమిరెడ్డి, ఉపాధ్యాయులు తిరుపతి, లక్ష్మణ్ రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మి, మారుతి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.