వేములవాడ : రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల ( Bar Council elections ) సందర్భంగా శుక్రవారం వేములవాడ కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమార్తి జ్యోతిర్మయి , ఎన్నికల అధికారి పొత్తూరి అనిల్ కుమార్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించారు. ఉదయం 10: 30 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం వరకు కొనసాగనున్నది. మరోవైపు రాష్ట్ర బార్ కౌన్సిల్ అభ్యర్థుల తరపున పోలింగ్ కేంద్రంలో పోటీదారుల అనుచరులు విస్తృత ప్రచారం చేశారు.