Aksaipalli waterfall | ధర్మపురి, ఆగస్టు 17: చల్లదనం కోసం ఇన్నాళ్లూ హిల్ బాటపట్టిన పర్యాటకులను ఇప్పుడు స్థానికంగానే జలపాతాలు ఆకర్షిస్తున్నాయి. గతంలోనైతే బాగా తెలిసిన కుంటాల, బోగతా వంటి వాటికి వెళ్లేవారు ఇప్పుడు స్థానికంగానే ధర్మపురి మండలం ఆక్సాయిపల్లి వద్ద పశువుల పాపన్న గుట్టకు పయనమవుతున్నారు. గుట్టపై నుండి జాలువారే వర్షపు నీరు జలపాతాన్ని తలపిస్తున్నది. యువత కేరింతలు కొడుతూ జలపాతాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.