Nominations | నామినేషన్ల సంఖ్య అసలు.. అధికారులకే తెల్వదటా..? రామగుండం బల్దియా అధికారుల విచిత్రం
రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరు మారడం లేదు. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే రామగుండంలో అధికారుల తీరు మరోలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఎన్నికల వేళ సైతం నిర్లక్ష్యం వీడటం లేదని పలువురు రాజకీయ పార్టీల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- సమాచారం ఇవ్వరు… ఫోన్లు ఎత్తరు..?
Nominations | కోల్ సిటీ, జనవరి 31: రామగుండం నగర పాలక సంస్థ అధికారుల తీరు మారడం లేదు. రాష్ట్రమంతటా ఒకలా ఉంటే రామగుండంలో అధికారుల తీరు మరోలా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల మాదిరిగానే ఎన్నికల వేళ సైతం నిర్లక్ష్యం వీడటం లేదని పలువురు రాజకీయ పార్టీల అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రామగుండం నగర పాలక సంస్థకు సంబంధించి నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గం.లతో ముగిసింది. కానీ శనివారం రాత్రి వరకు కూడా నామినేషన్లకు సంబంధించి ఏలాంటి సమాచారం ప్రకటించలేదు. నగరంలోని 60 డివిజన్లలో 706 నామినేషన్లు దాఖలు కాగా, డివిజన్ల వారీగా ఏఏ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్న కనీస సమాచారం కూడా శనివారం రాత్రి వరకు అధికారుల వద్ద లేదని చెప్పడం గమనార్హం. రామగుండం నగర పాలక పరిధిలో ఎక్కడికక్కడే 8 నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేయగా 30 మంది రిటర్నింగ్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఐనప్పటికీ ఎన్నికలకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి.
శనివారం రాత్రి వరకు సైతం పోటీలలో ఉన్న అభ్యర్థులకు గానీ, మీడియాకు గానీ ఏలాంటి సమాచారం ఇవ్వలేదు. నామినేషన్ల వివరాలకు సంబంధించి అధికారులకు ఫోన్లు చేస్తే ఎత్తడం లేదని పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. మీడియా ప్రతినిధుల ఫోన్లకు కూడా స్పందించకపోవడం గమనార్హం. శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు సంబంధించి కూడా సమాచారం ఇవ్వడంలో తాత్సారం చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇప్పటికైనా కలెక్టర్, ప్రత్యేక అధికారి జోక్యం చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

