back billing (electricity dues) | సిరిసిల్ల టౌన్, ఆగస్టు 29: బ్యాక్ బిల్లింగ్ పేరుతో పవర్లూమ్ పరిశ్రమల విద్యుత్ కనెక్షన్ తొలగించడాన్నీ నిరసిస్తూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యజమానులు ఆసాములు ఆందోళన చేపట్టారు. జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించి అనంతరం సెస్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పుడే దారిలో పడుతున్న వస్త్ర పరిశ్రమపై సెస్ అధికారులు 2016 నుండి ఉన్న బ్యాక్ బిల్లింగ్ చెల్లించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమనీ ప్రశ్నించారు.
ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో సెస్ బ్యాక్ బిల్లింగ్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపిన సెస్ అధికారులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆరు మాసాల్లో వస్ర పరిశ్రమకు సంబంధించిన కనెక్షన్ లను నాలుగు సార్లు కట్ చేశారనీ వాపోయారు. మీరు దౌర్జన్యంగా విధించిన బ్యాక్ బిల్లింగ్ , సర్ చార్జీలు చెల్లిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని , వెంటనే తొలగించిన కనెక్షన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.వెంటనే బ్యాక్ బిల్లింగ్ ను రద్దు చేసి వస్త్ర పరిశ్రమకు సహకరించాలని ఆవేదన వ్యక్తం చేశారు.