Mogilipalem | తిమ్మాపూర్, సెప్టెంబర్10 : కరీంనగర్ జిల్లా ఎల్ ఎండీ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మొగిలిపాలెం సర్పంచ్ పై కాంగ్రెస్ నాయకుడి దాడి నేపథ్యంలో సర్పంచ్ అనుచరులు గ్రామస్తులు మద్దతుదారులతో వెళ్లారు. కాగా కొంతమంది యువకులు దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బయటకు వెళ్లాలని సూచించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
బాధితులమైన తమపైనే పోలీసులు జులుంగా వ్యవహరించారని యువకులు ఆరోపించారు. పోలీసుల తీరుపై స్టేషన్లోనే నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకొని యువకులకు నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. బాధితుల పక్షాన ఉండాల్సిన సీఐ రమేష్, పోలీసులు తమపైనే దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.