Sports Day | రుద్రంగి, ఆగస్టు 29: రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్ధులు తెలుగుభాష దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని వివరించి 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఆంగ్లపదం ఉపయోగించకుండా రెండు నిమిషాలు తెలుగు భాషలో మాట్లాడే విధంగా ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
అనంతరం ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ధ్యాన్ చంద్ జీవిత చరిత్ర తెలుసుకొని, అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆటలు ఆడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరినాథ్రాజు, కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.