‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా మన కరీంనగర్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. ఉమ్మడి జిల్లా చరిత్రలో మొదటిసారిగా నిర్వహించిన ఈ ఎక్స్‌పోకు విశేష స్పందన లభించింది. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్ వందలాది మందితో కిటకిటలాడింది. శనివారం ఉదయం 10 గంటల తర్వాత రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలతోపాటు బ్యాంకులు పాల్గొనగా, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్టాళ్ల వద్దకు వెళ్లి వెంచర్లు, ఇండ్లు, అపార్ట్మెంట్లు బ్యాంకు రుణాలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. ఆయా సంస్థల ప్రతినిధులు ఓపిగ్గా వివరించడమే కాదు, రెస్పాన్స్‌ను చూసి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా ఎదుగుతున్న కరీంనగర్లో ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టడం బాగున్నదని, తమ కంపెనీలను ప్రజలకు చేరువ చేసే అవకాశం దొరికిందని చెబుతున్నారు.
– కార్పొరేషన్/ కమాన్‌చౌరస్తా, నవంబర్ 26
కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 26 : కరీంనగర్ జిల్లా చరిత్రలో మొట్ట మొదటిసారిగా నిర్వహించిన ప్రాపర్టీ షో మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయింది. ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. నగరంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా నిర్వహించగా, శనివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. షోను తిలకించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలతోపాటు, కరీంనగర్‌లోని పలు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. సుమారు 15కు పైగా రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన కంపెనీలు, ఐదుకు పైగా బ్యాంకులు పాల్గొన్నాయి. వీటితోపాటు భూములు, ఇండ్లు, అపార్ట్మెంట్లకు రుణాలను అందించే ప్రముఖ బ్యాంకులు షోలో పాల్గొని వివరించాయి. సందర్శకులు ప్రతి స్టాల్‌కు వెళ్లి వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ముఖ్యంగా ఆయా సంస్థల్లో కొనుగోలు చేస్తే అందించే సదుపాయాలు, ఆధునిక సౌకర్యాల వివరాలను తెలుసుకున్నారు. వీటితో పాటు బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలు, వాటికి సమర్పించాల్సిన వివిధ డాక్యుమెంట్ల వివరాలను సేకరించారు. పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడంతో స్టాల్స్ అన్నీ కిక్కిరిసిపోగా, రెవెన్యూ గార్డెన్ ప్రాంతమంతా సందడిగా మారింది.
నగరానికి చెందిన ప్రముఖులు, నాయకులు, రియల్ ఏజెంట్లు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో వచ్చారు. మొదటి రోజు లక్కీడ్రా ద్వారా బహుమతులు అందించారు. రెండు రోజు కూడా అందించనున్నారు. ఈ ప్రాపర్టీ షో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొననున్నారు. కాగా, మొదటి రోజు షోకు మంచి స్పందన వచ్చిందని, సెలవు దినమైన ఆదివారం మరింత పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో ఇలాంటి ప్రాపర్టీ షో నిర్వహించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయమని, ఇండ్లు, అపార్టుమెంట్లు, ప్లాట్లు, గృహ రుణాల గురించి ఒకే చోట తెలుసుకునే అవకాశం ఏర్పడిందని సందర్శకులు చెబుతున్నారు. ఇలాంటి వేదికలు అప్పుడప్పుడు ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రాపర్టీ షో స్పాన్సర్లు..
ఈ ప్రాపర్టీ షోకు ‘టీ న్యూస్’ మీడియా పార్టనర్‌గా వ్యవహరించింది. మెయిన్ స్పాన్సర్లుగా పీ మంగాత్రం, అపర్ణ, హైదరాబాద్ కంపెనీలు, అసోసియేట్ స్పాన్సర్‌గా రాయిచందని సింధ్ డెవలపర్స్ వ్యవహరించాయి. కో స్పాన్సర్లుగా ఆదర్శ కంఫర్ట్స్, బిల్డ్ అర్బన్ కన్స్ట్రక్షన్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, స్పాన్సర్లుగా ఉస్మాని కన్స్ట్రక్షన్స్, మైత్రి గ్రూప్స్, రాయల్ రిడ్జ్, డ్యూరో, రెప్కో హోమ్లోన్స్, శ్రీ వెంకటేశ్వర అవెన్యూ, కేకే ఎంటర్ ప్రైజెస్, మహాలక్ష్మి మార్కెటింగ్తోపాటు బ్యాంకులు ఎస్బీఐ, యూబీఐ, బీవోబీ, కేడీసీసీబీ కొనసాగాయి.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా కరీంనగర్‌లోని రెవెన్యూ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన ప్రాపర్టీ షోకు విశేష స్పందన లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. పలు రియల్ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లలో వెంచర్లు, ఇళ్లు, బ్యాంకు రుణాల గురించి తెలుసుకున్నారు. షోలో పాల్గొనడం వల్ల తమ కంపెనీల గురించి ప్రజలకు తెలిసే అవకాశం దొరికిందని మరోవైపు సొంతిల్లు, అపార్టుమెంట్లు, ప్లాట్లు కొనాలనుకునేవారికి అన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈ షో చక్కని వేదిక అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కృతజ్ఞతలు తెలిపారు.
-కమాన్‌చౌరస్తా, నవంబర్ 26
ప్రాపర్టీషో మంచి వేదిక
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాపర్టీషో ఒక మంచి వేదిక. దీని ద్వారా ఎవరికి ఎలాంటి ఇళ్లు, భవనం, కావాలన్నా ఒకే వేదికపై వివరాలు తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. సందర్శకులు పెద్ద సంఖ్యలో వచ్చి వివరాలు తెలుసుకున్నారు. నాణ్యమైన కట్టడాలు, ఫ్లాట్లు తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నరు.
– శ్రీనివాస్ రావు, ఎస్ఆర్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్
ఇంత స్పందన ఊహించలేదు
ప్రాపర్టీషోకు ఇంతటి స్పందన వస్తుందని ఊహించలేదు. వచ్చిన ప్రతి ఒక్కరూ మా స్టాల్ ను సందర్శించారు. మా వద్ద సోలార్ ఉత్ప త్తులకు, ఫెన్షింగ్ ఇలా చాలా రకాలైన ఉత్పత్తుల గురించి తెలుసుకున్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాల గురించి వారికి పూర్తిగా వివరించాం. వారు ఆసక్తితో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
– పీ రామారావు, కేకే ఎంటర్ప్రైజెస్
పెద్దపెద్ద సంస్థలు వచ్చాయి..
ప్రాపర్టీ షోలో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు భాగస్వా ములవడం బాగున్నది. నమస్తే తెంగాణ ద్వారా ఇలాంటి షో నిర్వహించి అన్ని నిర్మాణ, రియల్ ఎస్టేట్ సంస్థలను ఒక్క చోట చేర్చి ప్రజలకు చేరువ చేశారు. అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇండ్లు కట్టుకునే ప్రతి ఒక్కరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– ఎన్నం శ్రీనివాస్, సందర్శకుడు
ప్రాపర్టీ షో బాగుంది
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించడం చాలా బాగుంది. ఇందులో ఏర్పాటు చేసిన కంపనీల స్టాళ్లలో వివరాలు తెలుసుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ లాంటి ఉన్నతమైన నగరాల్లో స్థిర పడేందుకు ఇంట్రెస్ట్ చూపుతూ వివరాలు అడుగుతున్నారు. కరీంనగర్ అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో ఇక్కడ సైతం మా లాంటి పెద్ద సంస్థలను జిల్లాకు ఆహ్వానిస్తున్నారు.
– రోచిత్ అబ్బి, పీ మంగాత్రం డెవలపర్స్
రెస్పాన్స్ ఎక్కువగా ఉన్నది..
విలాస వంతమైన కట్టడాలు తీసుకోవడానికి ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది స్టాల్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. సందర్శకుల రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మేమే ప్రజలకు వద్దకు వచ్చినట్లు అనిపించింది. నమస్తే తెలంగాణ, తెలంగాణటుడే నిర్వాహకులకు మా ప్రత్యేక కృతజ్ఞతలు.
– రవికాంత్, అపర్ణ కన్స్ట్రక్షన్స్
తక్కువ ధరలో అందుబాటులోకి
కరీంనగర్ జిల్లా వాసులకు అతితక్కువ ధరకు, అపార్ట్మెంట్ల నుంచి పెద్ద స్థాయి లో విల్లాల వరకు అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ క్రమంలో సామాన్యులు సైతం ముందుకు వచ్చి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొదటిరోజు పెద్ద సంఖ్యలో వచ్చి వివరాలు తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది.
– జీ శ్యాం, ఆర్ఎస్డీ కన్స్ట్రక్షన్స్
స్పందన బాగున్నది
ఆర్థికంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో ప్రాపర్టీ షోకు స్పందన బాగావచ్చింది. సొంత ఇంటి నిర్మాణం కోసం పలువురు మా స్టాల్‌ను సంప్రదించారు. సాయంత్రం తాకిడి ఎక్కువగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు కరీంనగర్లో నిర్వహించడం మొదటి సారి. అయినా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్టాల్‌ను సందర్శించారు.
– రోహిత్, బిల్డ్ అర్బన్ కన్స్ట్రక్షన్స్
ఉన్నతమైన కట్టడాలకు డిమాండ్
ఉన్నతమైన కట్టడాలను నగర వాసులకు అనువైన రీతిలో అందిస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలో మాకు డిమాండ్ ఉంది. పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి షో ద్వారా మా కట్టడాల గురించి అందరికీ తెలిసేలా చేయడం ఆనందంగా ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– అజయ్ గౌడ్, ఆదర్శ కంఫర్ట్స్
సామాన్యులకు చేరువవుతున్నాం..
ఆకర్షణీయమైన కట్టడాలను అతి తక్కువ ధరలకు సామాన్యులకు అందిస్తూ వారికి చేరువవుతున్నాం. ఈ క్రమంలో నమస్తే తెలంగాణ నిర్వహించిన ప్రాపర్టీ షోలో భాగ స్వాములమై మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాం. పెద్ద సంఖ్యలో ఔత్సాహికులు ముందుకు వచ్చి మా స్టాల్‌ను సందర్శించి నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం.
– శంకర్‌రెడ్డి, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్