కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 23 : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలని, దేవుడి దయతో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సభిక్షంగా ఉండాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరీంనగర్‌లోని మారెట్ ఏరియా, మంకమ్మతోట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలతో పాటు, మంకమ్మతోటలోని సత్యనారాయణ స్వామి ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట మేయర్ సునీల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు పిట్టల శ్రీనివాస్, కిరణ్మయి, మల్లేశం, సీనియర్ నాయకులు జకుల నాగరాజు, సంపత్, సాయి పాల్గొన్నారు.